వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ముగ్గురు నక్సల్స్ లొంగుబాటు: ఇద్దరు అరెస్టు
హైదరాబాద్: ఇద్దరు నక్సలైట్లను రాజమండ్రి పోలీసులు అరెస్టు చేయగా వరంగల్ జిల్లాలో ముగ్గురు నక్సలైట్లు మహబూబాబాద్ డియస్‌పి ముందు లొంగిపోయారు. ఈ ఐదుగురు నక్సలైట్లు కూడా సిపిఐ (యంయల్) జనశక్తి రాజన్న గ్రూప్‌నకు చెందినారే. రాజమండ్రిలోని ఒక హోటల్‌లో బస చేశారని సమాచారం అందుకున్న పోలీసులు జనశక్తి రాజన్న గ్రూప్ ప్రముఖ నాయకుడు ఎద్దు రామచంద్రాన్ని, ఆయన సహాయకుడు విజయ్‌ను అరెస్టు చేశారు. రామచంద్రన్ గ్రూప్ నాయకుడు ఎం.వి. ప్రసాద్, ఆయన భార్య హత్య కేసుకు సంబంధించిన మిస్టరీ వీడగలదని పోలీసులు భావిస్తున్నారు. ఎద్దు రామచంద్రన్‌కు ప్రసాద్ హత్యతో సంబంధం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ విషయం విచారణలో తేలుతుందని వారంటున్నారు.
ఇదిలావుంటే, వరంగల్ జిల్లా మహబూబాబాద్‌లో జనశక్తి రాజన్న గ్రూప్‌కు చెందిన ముగ్గురు నక్సలైట్లు లొంగిపోయారు. లొంగిపోపయినవారిలో మహబూబాబాద్ దళ కమాండ్ భాస్కర్ అలియాస్ వెంకన్న, పాకాల దళ కమాండర్ వీరన్న, దళ సభ్యుడు సంపత్ ఉన్నారు. లొంగిపోయిన నక్సల్స్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు తూర్పు గోదావరి, ఖమ్మం జిల్లాల సరిహద్దుల్లో భారీ డంప్‌ను స్వాధీనం చేసుకున్నారు.
కాగా, నల్లగొండ జిల్లా పెద్ద అడిశర్లపల్లిలో మావోయిస్టులు ఒక మద్య దుకాణాన్ని ధ్వంసం చేసి లక్ష రూపాయల నగదు దోచుకెళ్లారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!