శివసేన నుంచి రాణే బహిష్కరణ: థాకరే
విశాఖపట్నం: నక్సల్స్‌తో ప్రభుత్వం శాంతిచర్చలు ప్రారంభిస్తే అందుకు తమ మద్దతు ఉంటుందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు చెప్పారు. మూడు రోజుల పాటు ఉత్తరాంధ్రలో పర్యటించిన ఆయన ఆదివారంనాడు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఆర్టీసి పరిరక్షిస్తామని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని తుంగలో తొక్కుతోందని ఆయన అన్నారు.
అధికారంలోకి వచ్చిన 13 నెలల కాలంలోనే కాంగ్రెస్ తీవ్రంగా అప్రతిష్ట పాలయిందని ఆయన అన్నారు. అంతకు ముందు ఆయన బహిరంగసభలో ప్రసంగించారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం పరోక్ష ఎన్నికలకు సిద్ధపడిందని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications
