టిఆర్‌యస్‌ది రెండు నాల్కల ధోరణి: వైయస్
పాలకొల్లు/ కరీంనగర్: నక్సల్స్ సమస్యపై తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్‌యస్) రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తోందని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి వ్యాఖ్యానించారు. టి ఆర్‌యస్ గురించి మాట్లాడటం సమయం వృధా తప్ప మరో ప్రయోజనం లేదని ఆయన అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆయన ఆదివారం రాజీవ్ నగర బాట నిర్వహించారు. రాష్ట్రంలో సంపూర్ణ అక్షరాస్యత సాధనే ప్రభుత్వ ధ్యేయమని ఆయన చెప్పుకున్నారు. పాల్లుకొల్లు పట్టణంలో ఆయన నూతన కళాశాల భవనానికి, రాజీవ్ గృహకల్ప పథకానికి శంకుస్థాపన చేశారు.
నక్సల్స్ విషయంలో హోం మంత్రి జానా రెడ్డి వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని ఆయన అభిప్రాయపడ్డారు. 2003 డియస్సీలో ఎంపికైన వారందరికీ ఈ నెలాఖరులో ఉద్యోగాలు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు.
తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం నుంచి వైదొలిగితే మంచిదేనని క్రీడలు, సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి ఎం. సత్యనారాయణ రావు అన్నారు.












Click it and Unblock the Notifications
