హీరో ఆకాశ్‌పై పోలీసులకు ఫిర్యాదు
హైదరాబాద్: గురు చిత్రం హీరో ఆకాశ్‌పై చిత్ర నిర్వాహకుడు అంకంరావు హైదరాబాద్‌లోని సనత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆకాశ్ తనను బెదిరించారని ఆయన ఈ ఫిర్యాదు చేశారు. తన చిత్ర ప్రచారం సరిగా నిర్వహించడం లేదంటూ ఆకాశ్ తనపై ఈ దుశ్చర్యకు దిగారని ఆయన అన్నారు. దీంతో ఆకాశ్‌ను పోలీసులు ఇప్పటికే ఒకసారి విచారించినట్లు సమాచారం. ప్రచారం సరిగా నిర్వహించకపోవడం వల్లనే తన చిత్రం బాగా ఆడటం లేదని ఆకాశ్ అంటున్నారని ఆయన అన్నారు.
తాను ప్రచారం సరిగానే నిర్వహిస్తున్నానని అంకంరావు చెబుతున్నారు. తన అనుచరులతో వచ్చి ఆకాశ్ తనపై దాడికి దిగాడని ఆయన ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలను ఆకాశ్ ఖండిస్తున్నారు. అయితే ఒక పథకం ప్రకారం అంకంరావు తన చిత్రం విజయవంతం కాకుండా పని చేస్తున్నారని ఆకాశ్ ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్నే తాను అంకంరావును అడిగానని, అంతకన్నా మించి అంకంరావుపై ఏ విధమైన చర్యకూ దిగలేదని ఆయన అంటున్నారు.












Click it and Unblock the Notifications
