వర్షంబాధితురాలి మృతదేహం లభ్యం
హైదరాబాద్:భారీవర్షం కారణంగా శుక్రవారం సాయంత్రంఅస్తవ్యస్ధమైనహైదరాబాద్ నగరంలో శనివారంపునర్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.తీవ్ర నిర్లక్ష్యంవహించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నవాటర్ వర్క్స్, మునిసిపల్, ట్రాఫిక్ పోలీసు సిబ్బంది విధుల్లోనిమగ్నమయ్యారు. అంబర్ పేటలో నిన్న మ్యాన్ హోల్‌లో పడి కొట్టుకుపోయినబ్యాంకు ఉద్యోగిని దుర్గాకుమారి మృతదేహంమూసీ నది ముఖద్వారం వద్ద లభ్యమైంది.భర్త టూవీలర్ మీద ఆమె ప్రయాణిస్తుండగా తెరచిఉన్నమ్యాన్ హోల్‌లో ఆమె పడిపోయింది.వర్షం కుండపోతగా కురవడంవల్లనే పరిస్ధితి చేజారిపోయిందనిఅధికారులు సంజాయిషీ ఇచ్చుకుంటున్నారు.జలమైన పల్లపు ప్రాంతాలకు చెందిన ఆరువందల మందికి పునారావాసం కల్పించామనివారు చెప్పారు. నిన్నటివర్షానికి నగరంలో ప్రధానరహదారులపై ట్రాఫిక్ దాదాపు నాలుగుగంటలసేపు నిలిచిపోయింది. వివిధ పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులుశనివారంఅనేక బస్తీలలో పర్యటించారు.












Click it and Unblock the Notifications
