"జరిగింది చాలు.. ఇక ?"- హిందూమతంపై సాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు..!

ఏపీలో కొత్త రాజకీయ పార్టీ పెడతానని ప్రకటించి ఆ దిశగా అడుగులు వేస్తున్న వైసీపీ మాజీ ఎంపీ విజయ సాయిరెడ్డి (Vijayasai Reddy).. హిందూ మతం అజెండాను బలంగా తెరపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన మరోసారి హిందూ మతాన్ని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. హిందూ మతం గొప్పతనం, రాష్ట్రంలో మత మార్పిళ్లకు జరుగుతున్న ప్రయత్నాలు, వాటిపై రాజకీయ పార్టీలు, నాయకుల స్పందన ఇలా పలు అంశాల్ని ప్రస్తావిస్తూ సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

Vijayasai Reddy: కొత్త రాజకీయ పార్టీపై విజయసాయిరెడ్డి ప్రకటన..!
Vijayasai Reddy: కొత్త రాజకీయ పార్టీపై విజయసాయిరెడ్డి ప్రకటన..!

హిందూ జీవన విధానమే అత్యుత్తమమైనదని విజయసాయిరెడ్డి తెలిపారు. తాము మహిళలను గౌరవిస్తామని, ఇతరుల పట్ల సహనంతో ఉంటామని, సమాజానికి మేలు చేసే దానధర్మాలు చేస్తామని, ఆర్థిక వ్యవస్థకు తోడ్పడతామని, ప్రకృతితో సామరస్యంగా జీవిస్తామని, తమ విశ్వాసాన్ని ఇతరులపై రుద్దమని సాయిరెడ్డి స్పష్టం చేశారు. దురదృష్టవశాత్తు, కొందరు ఈ సహన స్వభావాన్ని ఆసరాగా చేసుకుని, హిందువులను మత మార్పిడి చేయడానికి రకరకాల ఎత్తుగడలను ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. ఓట్ల కోసం శక్తివంతమైన నాయకులు దీనిని చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంతో, హిందువుల రక్షణ అనేది వెనుకబడుపోతోందని సాయిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

Vijayasai Reddy Says Hindu Way of Life Is Best Slams Politics Over Conversions
జగన్ శత్రువు కాదు, సజ్జల మళ్లీ కెలికితే అవన్నీ బయటికి ? సాయిరెడ్డి వార్నింగ్..!
జగన్ శత్రువు కాదు, సజ్జల మళ్లీ కెలికితే అవన్నీ బయటికి ? సాయిరెడ్డి వార్నింగ్..!

సాయిరెడ్డి తన తాజా ప్రెస్ మీట్లోనూ రాష్ట్రంలో మత మార్పిళ్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మత మార్పిళ్లు గతంలో ఉన్న ప్రభుత్వాల హయాంలోనూ జరిగాయని, ప్రస్తుత కూటమి ప్రభుత్వ హాయంలోనూ జరుగుతున్నాయని వెల్లడించారు. వీటిని అరికట్టేందుకు తన కొత్త రాజకీయ పార్టీ పనిచేస్తుందని కూడా తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో మత మార్పిళ్లతో పాటు లవ్ జిహాద్ వంటి అంశాలపై గొంతు విప్పుతున్న సాయిరెడ్డి.. భవిష్యత్తులో బీజేపీతో పోటీ పడేలా హిందూత్వ అజెండాతో ముందుకెళ్లబోతున్నారని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+