హామీలపై మళ్లీ పోరాటం తప్పదు: సిపియం
ఈ బహిరంగసభలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి నారాయణ పాల్గొన్నారు. సిపియం శాసనసభ్యులు నోముల నర్సింహయ్య, తమ్మినేని వీరభద్రం, సిపియం నాయకులు కొరటాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
సిపియం డిమాండ్ మేరకు పేదలకు ఇళ్ల స్థలాలను కేటాయించే విషయంలో ప్రభుత్వం కొన్ని నిబంధనలను సడలించింది. 1990 నుంచి పేదలకు ఆక్రమించుకున్న స్థలాల విషయంలో పట్టాలు ఇచ్చే విషయాన్ని పరిశీలించడానికి ఉన్నతాధికారులతో ఒక కమిటీ వేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 508 జీవో కాలపరిమితిని మరో ఏడాదిపాటు పొడిగిస్తున్నట్లు హోం మంత్రి కె. జానారెడ్డి చెప్పారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఇళ్ల పట్టాలు ఇవ్వకూడదనే నిబంధనను ప్రభుత్వం సడలిస్తుంది.












Click it and Unblock the Notifications