తప్పు చేస్తే తెలంగాణ జాగరణ సేనపై చర్యలు: జానా
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌యస్) తెలంగాణ జాగరణ సేనను ఏర్పాటు చేసుకోవడంలో తప్పు లేదని హోం మంత్రి కె. జానారెడ్డి అన్నారు. ఉద్యమాన్ని బలోపేతం చేసుకోవడానికి దాన్ని ఏర్పాటు చేసి ఉంటారని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణ జాగరణ సేన అనేది టి ఆర్‌యస్ భావోద్వేగపూరిత చర్య అని ఆయన అన్నారు. అన్ని సంస్థలపై ఉన్నట్లుగానే ఆ సంస్థపై కూడా నిఘా వుంటుందని ఆయన చెప్పారు.
జాగరణ సేన చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. జాగరణ సేన అనేది బాధ్యతాయుతమైన నిర్మాణంగానే తాము భావిస్తున్నామని, అవునో, కాదో మీడియా ప్రతినిధులు వారిని (టిఆర్‌యస్ నాయకులను) అడిగి తెలుసుకోవాలని ఆయన అన్నారు.
తెలంగాణ జాగరణ సేన ఏర్పాటుపై వ్యాఖ్యానించడానికి ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి నిరాకరించారు.












Click it and Unblock the Notifications
