వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వచ్చే నెల 5వ తేదీ నుంచి జెఎసి సమ్మె
హైదరాబాద్: వచ్చే నెల 5వ తేదీ అర్థరాత్రి నుంచి ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికులు, ఉపాధ్యాయులు సమ్మెకు దిగనున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మోహన్ కందాకు ఉద్యోగుల, కార్మికుల, ఉపాధ్యాయుల ఐక్య కార్యాచరణ సమితి (జెఎసి) బుధవారం సాయంత్రం సమ్మె నోటీసు ఇచ్చింది. గత్యంతరం లేకనే తాము సమ్మెకు దిగుతున్నామని, ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నామని జె ఎసి నాయకుడు మోహన్ రెడ్డి మీడియా ప్రతినిధులతో అన్నారు.
మంత్రులు, అధికారులు తమ సమస్యలను పరిష్కరించలేకపోయారని ఆయన అన్నారు. తమ సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డితో నేరుగా జరిగే చర్చల్లో మాత్రమే పాల్గొంటామని ఆయన చెప్పారు. తమ ఆరు ప్రధాన డిమాండ్లను పరిష్కరించడానికి ప్రభుత్వం ముందుకు రావడం లేదని, అందుకే సమ్మెకు దిగాల్సి వస్తోందని ఆయన అన్నారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!