నక్సల్స్‌పై నిషేధం పరిశీలన: వైయస్
హైదరాబాద్: నక్సల్స్‌పై నిషేధం విధించే అంశాన్ని పరిశీలిస్తున్నామని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి చెప్పారు. ఆయన బుధవారంనాడు రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌లో రాజీవ్ నగరబాటను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆ విషయం చెప్పారు. ఏడాది క్రితం నక్సల్స్‌పై నిషేధం విధించాల్సి ఉండగా అప్పటి పరిస్థితుల దృష్ట్యా దాన్ని వాయిదా వేశామని ఆయన అన్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా నక్సల్స్‌పై నిషేధాన్ని విధించే విషయాన్ని పరిశీలిస్తున్నామని ఆయన వివరించారు.
నక్సల్స్ పట్ల అనుసరించాల్సిన వైఖరిపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని మంగళవారం జరిగిన మంత్రి వర్గ సమావేశం ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డికి అప్పగించింది. దీంతో ఆయన మంగళవారం ఉదయం కేంద్ర హోం మంత్రి శివరాజ్ పాటిల్‌తో ఫోన్‌లో మాట్లాడారు. శివరాజ్ పాటిల్ నుంచి వచ్చిన సూచనల మేరకు వైయస్ నక్సల్స్‌పై నిషేధం విధించే దిశగా అడుగులు వేస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ శాసనసభ్యుడు చిట్టెం నర్సిరెడ్డిని, మరో 8 మందిని నక్సల్స్ దారుణంగా హత్య చేసిన నేపథ్యంలో మంగళవారం సాయంత్రం మంత్రివర్గ సమావేశం జరిగింది.












Click it and Unblock the Notifications