9 మంది ఐపియస్‌ల బదిలీ: ఎసిబి జెడిగా ప్రవీణ్
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం 9 మంది ఐపియస్ అధికారులను బదిలీ చేసింది. తెలుగుదేశం శాసనసభ్యుడు పరిటాల రవి హత్య జరిగిన సమయంలో అనంతపురం జిల్లా పోలీసు సూపరింటిండెంట్ (యస్పీ)గా పనిచేసిన ప్రవీణ్‌కుమార్‌ను అవినీతి నిరోధక శాఖ ( ఎసిబి) జాయింట్ డైరెక్టర్‌గా నియమించారు. ప్రవీణ్‌కుమార్ బదిలీ గతంలోనే జరిగినా విదేశీ పర్యటన మూలంగా ఆయనకు ఆ సమయంలో పదవి ఇవ్వలేదు.
మహబూబ్‌నగర్ జిల్లా యస్‌పిగా శ్రీనివాసరెడ్డి, ప్రకాశం జిల్లా యస్పీగా బాలసుబ్రహ్మణ్యం నియమితులయ్యారు. ఈ రెండు జిల్లాల్లో కూడా నక్సల్స్ ప్రభావం కాస్తా ఎక్కువగా ఉంది. గ్రేహౌండ్స్ ఎఐజిగా జితేంద్ర, ఇంటలిజెన్స్ సెక్యూరిటీ విభాగం యస్పీగా విక్రమ్‌సింగ్ మాన్, గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్‌గా అర్జున్ సింగ్ నియమితులయ్యారు. హైదరాబాద్ క్రైమ్ డిసిపిగా శశిధర్ రెడ్డి, హైదరాబాద్ వెస్ట్‌జోన్ డిసిపిగా అమిత్ గార్గు, ఎపియస్ ఆర్టీసి విజిలెన్స్ యస్పీగా సంజయ్ నియమితులయ్యారు.












Click it and Unblock the Notifications