తెలంగాణఏర్పాటుపై మాట మార్చిన నరేంద్ర
హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై ఆ పార్టీ నాయకుడు, కేంద్రమంత్రి ఎ. నరేంద్ర శనివారం మళ్ళీమాట మార్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకుఅసెంబ్లీ తీర్మానం చేయాలని,అధిష్టానవర్గం తలుచుకుంటే అది పెద్దపని కాదని రెండు రోజుల క్రితం అన్న నరేంద్రనేడు కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంటేచాలని, అసెంబ్లీతీర్మానంతో పని లేదని అభిప్రాయపడ్డారు.తెలంగాణ సాధన మూడొంతులు పూర్తయిందని టిఆర్‌ఎస్ అధినేత,కేంద్ర మంత్రి కె. చంద్రశేఖరరావుఅనడంపై నరేంద్ర వ్యాఖ్యానించలేదు.తెలంగాణపై ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలోని కేంద్రమంత్రి వర్గఉపసంఘం ఎప్పుడు నివేదిక సమర్పిస్తుందోతనకు తెలియదని నరేంద్రఅన్నారు.












Click it and Unblock the Notifications