కాగ్నానదిలో 5 గంటలున్న రైతు: కాపాడిన అధికారులు
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా తాండూరు మండలంలో కాగ్నా నదిలో చిక్కుకున్న ఒక రైతును హెలికాప్టర్ సాయంతో రక్షించారు. కాగ్నా నదిలో ఆ రైతు ఐదు గంటలపాటు చిక్కుకుని ఎట్టకేలకు ప్రాణాలతో బయటపడ్డాడు. రైతు నది దాటి పొలానికి వెళ్తుండగా వరద ఉధృతి హఠాత్తుగా పెరిగింది. దీంతో అతను నదిలో కొట్టుకుపోసాగాడు. మధ్యలో ఒక చెట్టు ఆసరా తీసుకున్నాడు. ఇది గమనించిన గ్రామస్థులు విషయాన్ని అధికారులకు తెలియజేశారు. అధికారులు రంగంలోకి దిగి గజ ఈతగాళ్లను రప్పించి నదిలోకి పంపారు. అయితే వరద ఉధృతి ఎప్పటికప్పుడు విపరీతంగా పెరుగుతుండడంతో గజ ఈతగాళ్ల ప్రయత్నం ఫలించలేదు. దీంతో హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌ను తీసికెళ్లి దాని సాయంతో రైతును కాపాడారు.












Click it and Unblock the Notifications
