కాంగ్రెస్‌తో పొత్తు ఉండదు, అయితే...: టిఆర్‌యస్
హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు ఉండదని తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్‌యస్) నాయకుడు, మాజీ రాష్ట్ర మంత్రి విజయరామారావు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్‌పై స్పష్టమైన వైఖరి ప్రకటించనందున తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. అయితే మేయర్, చైర్‌పర్సన్ పదవులకు జరిగే ఎన్నికల్లో తాము కాంగ్రెస్‌కు సహకరిస్తామని, తాము కాంగ్రెస్ సహకారం తీసుకుంటామని ఆయన చెప్పారు.
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల కన్నా తాము ముందుంటామని, తమ పార్టీ రోజు రోజుకూ బలోపేతం అవుతోందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై కాంగ్రెస్ అధిష్ఠానవర్గం సానుకూలంగా స్పందిస్తుందనే నమ్మకం తమకు ఉందని, అందువల్ల మరో ఏడాది పాటు నిరీక్షించదలుచుకున్నామని ఆయన వివరించారు.












Click it and Unblock the Notifications
