పోటీ చేయం, ఎవరికీ మద్దతివ్వం: విజయశాంతి
హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో తాము పోటీ చేయడం లేదని, ఎవరికి కూడా మద్దతు ఇవ్వడం లేదని సినీనటి, తెలంగాణ ఉద్యమ నాయకురాలు విజయశాంతి చెప్పారు. భవిష్యత్తులో సరైన సమయంలో తాము పోటీ చేయడానికి అవకాశాలు లేకపోలేదని, అయితే ఇప్పుడు మాత్రం పోటీ చేయడం లేదని ఆమె స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌యస్) ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ) నుంచి బయటకు వస్తుందని అంటున్నారని, వస్తే చాలా సంతోషమని ఆమె మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. టిఆర్‌యస్ తెలంగాణ జాగరణ సేనను ఏర్పాటు చేయడాన్ని బట్టి యుపిఎ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వదనేది అర్థమవుతోందని ఆమె అన్నారు.
హింసకు చోటు లేకుండా తెలంగాణ జారగణ సేన పని చేస్తే చాలా మంచిదని, అలా పనిచేస్తే తెలంగాణకు మేలు జరుగుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. మావోయిస్టులపై నిషేధం ఎత్తేసి చర్చలు జరిపాలని ఆమె రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విప్లవ రచయితల సంఘం నాయకులు వరవరరావుపై, కళ్యాణ్‌రావుపై కేసులు ఎత్తేసి, వారిని విడుదల చేయాలని కూడా ఆమె డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications