స్వదేశానికితిరిగి వస్తున్న ప్రధాని మన్మోహన్
న్యూయార్క్:ప్రధాని మన్మోహన్‌సింగ్‌వారం రోజుల ఫ్రాన్స్, న్యూయార్క్ పర్యటనలుముగించుకుని ఈరోజు భారత్‌కు బయలుదేరారు.తొలుత ఫ్రాన్స్ వెళ్లిన ప్రధాని ఫ్రెంచ్‌అధ్యక్షుడుజాక్వెస్ చిరాక్‌తో సమావేశమయ్యారు.పౌర అణు సహకార ఒప్పందం, ఐక్య రాజ్యసమితి సంస్కరణలపై వీరిమధ్య ప్రధానంగాచర్చ జరిగింది. అనంతరం ఐక్యరాజ్య సమితిజనరల్ అసెంబ్లీ సమావేశాల కోసం ప్రధానిన్యూయార్క్ వెళ్లారు. సర్వ ప్రతినిధిసభలో ప్రసంగించడంతోబాటు అమెరికాఅధ్యక్షుడుజార్జ్ బుష్, పాకిస్తాన్ అధ్యక్షుడుపర్వేజ్ ముషార్రఫ్‌లతో మన్మోహన్‌చర్చలు జరిపారు. బుష్‌తో సమావేశంలోఇండో-అమెరికా అణు ఒప్పందం అమలు, ఇరాన్‌తోఒప్పందం అంశాలు చర్చకు వచ్చాయి. కాశ్మీర్‌సమస్య, శాంతి ప్రక్రియను ముందుకుతీసుకువెళ్లడం తదితర అంశాలపైముషార్రఫ్‌తో మన్మోహన్ చర్చలుజరిపారు.












Click it and Unblock the Notifications