మున్సిపల్ ఎన్నికల తర్వాత మంత్రివర్గ విస్తరణ
హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల తర్వాత రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి ఆదివారంనాడు ఒక ప్రైవేట్ తెలుగు టీవీ ఛానల్ ప్రతినిధికిచ్చిన ఇంటర్వ్యూలో సూచనప్రాయంగా చెప్పారు. పనితీరునే విస్తరణకు ప్రాతిపదికగా తీసుకుంటామని ఆయన చెప్పారు. మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర మంత్రివర్గాన్ని విస్తరించలేదు. అవినీతి ఆరోపణలు ఎదుర్కున్న ఇద్దరు మంత్రుల శాఖలను మార్చారు. తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌యస్) మంత్రులు ఆరుగురు మంత్రివర్గం నుంచి తప్పుకున్నారు. ఈ స్థితిలో రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గాన్ని విస్తరించకుండా మంత్రులకు మరిన్ని శాఖలను పంచిపెట్టారు.
మున్పిపల్ ఎన్నికల్లో శాసనసభ్యుల పనితీరును పరిగణనలోకి తీసుకుని మంత్రివర్గాన్ని విస్తరించాలని ముఖ్యమంత్రి అనుకున్నట్లు తెలుస్తోంది. తన నీటి పారుదల ప్రాజెక్టుల సమీక్షా కార్యక్రమాలను తెలుగుదేశం తప్పు పట్టడాన్ని ఆయన విమర్శించారు. సాగునీటి ప్రాజెక్టులు సకాలంలో పూర్తయ్యేందుకే తాను సమీక్షలు జరుపుతున్నానని ఆయన ఆ ప్రతినిధితో అన్నారు. రెండేళ్లలో ఎనిమిది ప్రాజెక్టులు పూర్తి చేస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
