తెరాసను వదులుకోం: దిగ్విజయ్ సింగ్
విజయవాడ: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో తమ మైత్రి కొనసాగుతుందని కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ మరోసారి స్పష్టం చేశారు. వరద తాకిడి ప్రాంతాల్లో పర్యటించడానికి యుపి ఎ చైర్ పర్సన్ సోనియా గాంధీతో పాటు వచ్చిన దిగ్విజయ్ సింగ్ మంగళవారంనాడు కొద్దిసేపు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తమ మిత్రులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోబోమని ఆయన చెప్పారు.
రాష్ట్రంలో సంభవించిన వరదల బీభత్సాన్ని కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా పరిగణించే అవకాశం ఉందని ఆయన చెప్పారు. అయితే వరదలు జాతీయ విపత్తుగా పరిగణించాల్సిన స్థాయిలో లేవని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డాక్టర్ కె. కేశవరావు అన్నారు.












Click it and Unblock the Notifications
