బిసి,ఎస్‌సిలకు ప్రత్యక్ష దైవాన్ని: మాయావతి
న్యూఢిల్లీ:బహుజన్ సమాజ్‌వాదీపార్టీ (బిఎస్‌పి) అధినేతమాయావతి తననుతాను ప్రత్యక్షదైవంగా అభివర్ణించుకున్నారు. దేశంలోనిదళితులు, ఇతర వెనుకబడి న వర్గాలవారుఒకే వేదికపైకి రావాలని ఢిల్లీలో శనివారం జరిగిన బిఎస్‌పి ర్యాలీలోమాయావతి పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో తామువిజయం సాధిస్తే ప్రైవేట్ ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్లుఅమలు చేస్తామని హామీ ఇచ్చారు. తమపేదరికాన్ని పోగొట్టమని ప్రజలు భగవంతునికిడ బ్బు విరాళంగా ఇస్తుంటారని, వారికోసమేనిస్వార్థంగా పాటుపడుతున్న బిఎస్‌పికినిధులు సమకూర్చాలని మాయావతి కోరారు.వెనుక బడిన వర్గాల అభ్యున్నతికి కృషిచేస్తున్న తాను ప్రత్యక్ష దైవాన్ని అనిమాయావతి సొంత బాజామోగించుకున్నారు. దళితులు, నిమ్నజాతులఉద్ధరణకు కట్టుబడి ఉన్న తానువివాహం, కుటుంబం కూడా లేకుండా సేవ చేస్తున్నాననిచెప్పారు. వెనుకబడిన వర్గాలవారంతాఐకమత్యంతో ఉంటే కేంద్రంలోను, రాష్ట్రాల్లోనుబిఎస్‌పి అధికారంలోకి రావడం ఖాయమనిమాయావతి విశ్వాసం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications
