టెలిఫోన్ భవన్‌కు బాంబు బూచీ
హైదరాబాద్: బాంబు బూచీ సోమవారంనాడు టెలిఫోన్ భవన్ ఉద్యోగులను పరుగులు తీయించింది. టెలిఫోన్ భవన్‌లో బాంబు పెట్టారని, అది పేలి టెలిఫోన్ భవన్ కూలిపోతుందని సోమవారం ఉదయం కంట్రోల్ రూమ్ నెంబర్‌కు ఒక ఫోన్ వచ్చింది. దీంతో టెలిఫోన్ భవన్‌లోని ఉద్యోగులు ప్రాణాలు అరచేత పట్టుకుని బయటకు పరుగులు తీశారు. ఆ వెంటనే నాలుగు బాంబు స్క్వాడ్‌లు రంగంలోకి దిగాయి. టెలిఫోన్ భవన్ మూలమూలలా వెతికాయి. అయితే అది ఉట్టిదేనని తేలింది.
సోమవారం ఉదయం పదిగంటలకు ఫోన్ వచ్చింది. హైదరాబాద్‌లోని టెలిఫోన్ భవన్‌లో మొత్తం పది అంతస్థులున్నాయి. వెంటనే బాంబు స్క్వాడ్స్ రంగంలోకి దిగి తనిఖీలు ప్రారంభించారు. ఆ సమయంలో లోనికి ఎవరినీ అనుమతించలేదు. దాదాపు మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆ తనిఖీలు జరిగాయి. బాంబు పెట్టారనేది అబద్ధమని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.












Click it and Unblock the Notifications