మనోహర్‌కు యావజ్జీవ ఖైదు విధించిన హైకోర్టు
హైదరాబాద్: విజయవాడలో శ్రీలక్ష్మి అనే విద్యార్థినిని హత్య చేసిన మనోహర్‌కు హైకోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. మనోహర్‌కు కింది కోర్టు మరణశిక్ష విధించింది. కింది కోర్టు విధించిన మరణశిక్షను జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ వెంకటేశ్వర్ రెడ్డిలతో కూడిన హైకోర్టు బెంచ్ యావజ్జీవ కారాగార శిక్షగా మార్చింది.
తనను ప్రేమించలేదనే కోపంతో మనోహర్ శ్రీలక్ష్మీ అందరి ముందే దారుణంగా హత్య చేశాడు. దీనిపై వివిధ మహిళా సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. మనోహర్‌కు ఉరిశిక్ష విధించడం న్యాయమేనని సమర్థించాయి. అయితే మనోహర్ మారడానికి ఇంకా అవకాశాలున్నాయని, అందువల్ల మరణశిక్ష విధించడం అంతిమ పరిష్కారం కాబోదని హైకోర్టు అభిప్రాయపడింది.












Click it and Unblock the Notifications