జపాన్ ఓపెన్: సెమీ ఫైనల్‌లో సానియా
టోక్యో: జపాన్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో భారత టెన్నిస్ తార సానియా మీర్జా దూసుకుపోతోంది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో సానియా టాప్‌సీడ్ రష్యన్ క్రీడాకారిణి జోనావెరాను ఓడించి సెమీ ఫైనల్‌లోకి అడుగు పెట్టింది. మొదటి సెట్‌ను కోల్పోయిన సానియా ఆ తర్వాత విజృంభించి ఆడింది.
జోనెవారను సానియా 5-7, 6-2, 6-4 స్కోరుతో ఓడించింది. ప్రపంచ ర్యాంకింగ్‌లో 24వ స్థానంలో ఉన్న జెనావెరా మొదటి సెట్‌లో 34వ ర్యాంకింగ్ సానియాను మట్టి కరిపిస్తుందనే భావనను కల్పించింది. సానియా ఇంతకు ముందు జపాన్‌కు చెందిన నకమురాను 6-1, 6-4 స్కోరుతో ఓడించి క్వార్టర్ ఫైనల్‌లోకి చేరుకుంది.












Click it and Unblock the Notifications