పోలవరం అభిప్రాయసేకరణకు ఆందోళన అడ్డు
ఖమ్మం: పోలవరం ప్రాజెక్టుపై తలపెట్టిన ప్రజాభిప్రాయ సేకరణ సోమవారం ఖమ్మం జిల్లా భద్రాచలంలో రసాభాసగా మారింది. ముంపు బాధితుల ఆందోళనతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో ప్రజాభిప్రాయ సేకరణ అర్థాంతరంగా వాయిదా పడింది. నష్ట పరిహారం చెల్లించిన తర్వాతనే పనులు ప్రారంభించాలని ముంపు బాధితులు డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. ఆందోళనకు దిగిన గిరిజనులను పోలీసులు నెట్టివేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో గిరిజనులు సభా వేదిక వద్ద బైఠాయించారు.
నిర్వాసితులకు నష్ట పరిహారం చెల్లించి, ఇళ్లు నిర్మించి ఇచ్చిన తర్వాతనే పనులు ప్రారంభిస్తామని కాంగ్రెస్ శాసనసభ్యుడు వెంకటరెడ్డి హామీ ఇచ్చినా ఆందోళనకారులు వినలేదు. పోలవరం ఎత్తును తగ్గించి ముంపు ప్రాంతాలను తగ్గించాలని కమ్యూనిస్టు శాసనభ్యులు సున్నం రాజయ్య, వెంకటేశ్వర్లు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు, గిరిజన సంఘాల కార్యకర్తలు దువ్వ జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు.












Click it and Unblock the Notifications
