వోక్స్ కేసు: మెజిస్ట్రేట్ ముందు గాయత్రీరాయ్
హైదరాబాద్: వోక్స్ వ్యాగన్ కేసులో గాయత్రీరాయ్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) అధికారులు మంగళవారంనాడు నాంపల్లి ఐదవ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. ఈ నెల 25వ తేదీ వరకు జ్యుడిష్యల్ కస్టడీ విధిస్తూ మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు. గాయత్రీరాయ్‌ను సిబిఐ అధికారులు సోమవారం చెన్నైలో అరెస్టు చేశారు. వెంటనే ఆమెను ఎగ్మూర్ కోర్టులో ప్రవేశపెట్టి హైదరాబాద్‌కు తరలించారు.
గాయత్రీరాయ్‌ను మంగళవారంనాడు సిబిఐ ఐదవ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు ఆయన నివాసంలో ప్రవేశపెట్టారు. మంగళవారం కోర్టుకు సెలవు కావడంతో ఆమెను ఆయన ఇంటిలో ఆయన ముందు హాజరుపరిచారు. గాయత్రీరాయ్ విదేశీ ఖాతాలో వోక్స్ వ్యాగన్ వ్యవహారానికి సంబంధించిన 2 కోట్ల రూపాయలు లభించడంతో ఆమెను అరెస్టు చేశారు. విచారణ నిమిత్తం ఆమెను తమ కస్టడీకి అప్పగించాలని సిబిఐ అధికారులు మెజిస్ట్రేట్‌ను కోరారు.












Click it and Unblock the Notifications
