దలైలామా ప్రకటనపై దళితుల నిరసన
హైదరాబాద్: ఆచార్య నాగార్జునుడ్ని బౌద్ధ మతగురువు బుద్ధుని అవతావరంగా పోల్చడాన్ని నిరసిస్తూ బుధవారం దళితులు ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనలో ప్రముఖ వాగ్గేయకారుడు గద్దర్ కూడా పాల్గొన్నారు. బ్రాహ్మణుడైన నాగార్జునుడ్ని బుద్ధుని అవతారంగా పోల్చడం అగ్రవర్ణాల మెప్పు పొందడానికేనని దళితులు విమర్శించారు.
హిందూ బౌద్ధమతాలు కవలపిల్లలంటూ దలైలామా ప్రకటన చేయడం హిందూ మతాన్ని సమర్థించడమేనని, ఇది సరైంది కాదని వారన్నారు. బుద్ధుడ్ని దశావతారంగా పోల్చిన దలైలామా తాను పదకొండో అవతారంగా మారాలనుకుంటున్నారని వారు వ్యాఖ్యానించారు.
ఇదిలావుంటే, మంగళవారం నాగార్జునసాగర్‌ను సందర్శించిన దలైలామా బుధవారంనాడు గుంటూరు జిల్లాలోని అమరావతి చేరుకున్నారు. అమరావతిలో మంత్రులు కె. రోశయ్య, జె. గీతారెడ్డి ఆయనకు స్వాగతం పలికారు. దలైలామాను చూసేందుకు ప్రజలు బారులు తీరారు.












Click it and Unblock the Notifications
