ఐఐయస్‌సిపై దాడి: చెన్నైలో కర్ణాటక పోలీసులు
చెన్నై: గత నెల 28వ తేదీన బెంగుళూర్‌లోని భారత వైద్యవిజ్ఞాన సంస్థ కేంద్రం (ఐఐయస్‌సి)పై దాడి కేసుకు సంబంధించి దర్యాప్తు నిమిత్తం కర్ణాటక పోలీసులు చెన్నై వచ్చారు. చెన్నైలో ఇద్దరు ముస్లిం తీవ్రవాదులను అరెస్టు చేశారనే వార్తల నేపథ్యంలో కర్ణాటక పోలీసులు ఇక్కడికి చేరుకున్నారు. అయితే తాము ఎవరినీ అరెస్టు చేయలేదని పోలీసులు అంటున్నారు.
మంగుళూర్‌కు పారిపోవడానికి ప్రయత్నాలు చేస్తున్న బషీర్, అబ్దుల్లా అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసినట్లు వార్తలు వచ్చాయి. వారిని రహస్య ప్రదేశంలో ఉంచి, విచారిస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి. దాడికి సంబంధించి వివిధ అంశాలపై కర్ణాటక పోలీసులు పరిశీలిస్తున్నారని, వారికి నగర పోలీసులు సహకరిస్తున్నారని చెన్నై పోలీసు కమీషనర్ ఆర్. నటరాజ్ అంటున్నారు.












Click it and Unblock the Notifications
