వాడిగా వేడిగా తెరాస సమావేశం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) సమావేశం ఆదివారం సాయంత్రం వరకు కూడా వేడిగా వాడిగా జరుగుతోంది. తెరాస అధినేత కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఏర్పాటయిన సమావేశంలో ఎవరి వాదనలను వారు సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ ఏర్పాటు కోసం తాను ఢిల్లీలో చేసిన లాబీయింగ్ గురించి చంద్రశేఖర్ రావు వివరించినట్లు సమాచారం.
తెలంగాణ ఉద్యమాన్ని కాపాడి ముందుకు నడిపించడానికే తాము ప్రశ్నల వర్షం సంధించామని అసమ్మతి శాసనసభ్యుల ప్రతినిధి మందాడి సత్యనారాయణ రావు చెప్పుకున్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి ఎస్. సంతోష్ రెడ్డి తన చర్యలకు గల నేపథ్యాన్ని వివరించినట్లు సమాచారం. ఈ సమావేశానికి అసమ్మతి శాసనసభ్యులు దుగ్యాల శ్రీనివాస రావు, తూర్పు జయప్రకాశ్ రెడ్డి, శారారాణి హాజరు కాలేదు. కె. చంద్రశేఖర్ రావు పచ్చి అవకాశవాది అని దుగ్యాల శ్రీనివాస రావు విమర్శించారు.












Click it and Unblock the Notifications
