కోర్టులపై ఎందుకీ చిన్నచూపు?: హైకోర్టు
హైదరాబాద్: కోర్టుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వివక్ష ప్రదర్శిస్తోందని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టులో తగిన సిబ్బందిని నియమించకపోవడం పట్ల రాష్ట్ర ప్రభుత్వంపై ఛీఫ్ జస్టిస్ సింఘ్వీతో కూడిన హైకోర్టు బెంచ్ మంగళవారం నిరసన వ్యక్తం చేసింది. పార్ట్‌టైమ్ అటెండర్లను ఫుల్‌టైమ్ అటెండర్లుగా నియమించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు ప్రభుత్వం కోర్టుల పట్ల వ్యవహరిస్తున్న తీరును తప్పు పట్టింది.
నిధులు సమకూర్చకపోతే కోర్టులు సకాలంలో ఎలా న్యాయం అందజేస్తాయని, కోర్టుల పట్ల ఈ చిన్నచూపు ఎందుకని హైకోర్టు ప్రశ్నించింది. తాము పనిచేస్తున్నదని తమ కోసం కాదని, ప్రజల కోసమనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలని హైకోర్టు వ్యాఖ్యానించింది.












Click it and Unblock the Notifications
