తెరాస అసమ్మతి ఎమ్యెల్యే శారారాణి వాకౌట్
హైదరాబాద్: తనను సభలో మాట్లాడనివ్వకపోవడాన్ని నిరసిస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అసమ్మతి శాసనసభ్యురాలు బండారు శారారాణి మంగళవారంనాడు శాసనసభ నుంచి వాకౌట్ చేశారు. ప్రజాసమస్యలపై తాను సభలో మాట్లాడుతుంటే తెరాస సభ్యులు అడ్డుకుంటన్నారని ఆమె ఫిర్యాదు చేశారు. శాసనసభ వెలుపల మాట్లాడుతుంటే దిష్టిబొమ్మలు దగ్ధం చేయాలని, గ్రామ బహిష్కారం చేయాలని తమ పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖర్ రావు అంటున్నారని ఆమె అన్నారు.
శాసనసభ వెలుపల మాట్లాడనీయరని, శాసనసభ లోపలా మాట్లాడనీయండం లేదని ఆమె అన్నారు. ఒక దళిత మహిళ అని కూడా చూడకుండా తన ప్రసంగాన్ని తెరాస సభ్యులు అడ్డుకుంటున్నారని ఆమె అన్నారు. తనను మాట్లాడనీయనందుకు నిరసనగా తాను వాకౌట్ చేస్తున్నానని చెప్పి ఆమె శాసనసభ సమావేశాల నుంచి వెళ్లిపోయారు.












Click it and Unblock the Notifications
