గుంటూరు జిల్లాలో మావోయిస్టు హతం
గుంటూరు: గుంటూరు జిల్లా బొల్లాపల్లి గ్రామం వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. మరణించిన మావోయిస్టును శ్రీనివాస్‌గా అనుమానిస్తున్నారు. సంఘటనా స్థలం వద్ద ఒక హీరోహోండాను, తపంచాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు మావోయిస్టులు పారిపోయినట్లు పోలీసులు చెబుతున్నారు.
పోలీసుల కథనం ప్రకారం- పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. హీరోహోండాపై వస్తున్న ముగ్గురు వ్యక్తులను ఆపడానికి పోలీసులు ప్రయత్నించారు. అయితే వారు వాహనం ఆపకుండా దూసుకెళ్లి పోలీసులపైకి కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు మరణించగా, మరో ఇద్దరు పారిపోయారు.












Click it and Unblock the Notifications
