ఎల్లంపల్లి అక్రమాలపై విపక్షాల ఆందోళన
హైదరాబాద్: ఎల్లంపల్లి ప్రాజెక్టు ఫైళ్లను స్పీకర్ వద్ద ఉంచాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ మంగళవారం శాసనసభ ఆవరణలో ధర్నా చేసింది. ఎల్లంపల్లి ప్రాజెక్టు ఒక్క టెండర్ ఖరారులోనే 400 కోట్ల అవినీతి చోటు చేసుకుందని తెలుగదేశం శాసనసభా పక్షం ఉపనాయకుడు డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి విమర్శించారు. స్పీకర్ వద్ద ఫైళ్లు పెడితే అవినీతి బయటపడుతుందని కాంగ్రెస్ భయపడుతోందని ఆయన విమర్శించారు. ఒక్క టెండర్‌లోనే అంత అక్రమం జరిగితే సాగునీటి ప్రాజెక్టుల్లో వేల కోట్ల అవినీతి జరిగి వుంటుందని ఆయన అన్నారు. అపంతరం తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు శాసనసభ నుంచి ట్యాంక్‌బండ్ వరకు ర్యాలీ నిర్వహించింది.
సిపియం, సిపిఐ, మజ్లీస్ మౌన ప్రదర్శన నిర్వహించాయి. ఎల్లంపల్లి ప్రాజెక్టు ఫైళ్లను స్పీకర్ వద్ద పెట్టాల్సిందేనని సిపియం శాసనసభా పక్షం నాయకుడు నోముల నరసింహయ్య డిమాండ్ చేశారు. సాగునీటి ప్రాజెక్టుల పేరుతో కాంగ్రెస్‌వారు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆయన విమర్శించారు. అవినీతి వద్దన్నందుకు తమను అసెంబ్లీ సమావేశాల నుంచి బయటకు పంపించారని ఆయన అన్నారు. తమను బయటకు పంపి కాంగ్రెస్‌వారు శాసనసభా సమావేశాన్ని కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సియల్‌పి) సమావేశాల మాదిరిగా నిర్వహించుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications
