610 జీవోకు ప్రభుత్వ వక్రభాష్యం: తెరాస
హైదరాబాద్: గిర్‌గ్లానీ కమీషన్, 610 జీవోలకు రాష్ట్ర ప్రభుత్వం వక్రభాష్యం చెబుతోందని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభా పక్ష నాయకుడు విజయరామారావు విమర్శించారు. 610 జీవో స్ఫూర్తికి భంగం కలిగిస్తూ ప్రభుత్వం మరో జీవో జారీ చేసిందని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. ఆరు సూత్రాల పథకాన్ని సమీక్షించేందుకు వీలుగా ప్రభుత్వం జీవో జారీ చేసిందని ఆయన చెప్పారు.
610 జీవో స్ఫూర్తికి భంగం కలిగిస్తే తాము సహించబోమని ఆయన హెచ్చరించారు. తెలంగాణ ప్రయోజనాలకు విరుద్దంగా ప్రభుత్వం కొత్త జీవోను జారీ చేసిందని ఆయన విమర్శించారు. కొత్త జీవోను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications
