తొలి అంచనాలకు ప్రాజెక్టు పూర్తి చేస్తారా?: కెకె
హైదరాబాద్: ఎల్లంపల్లి ప్రాజెక్టును చేపడితే పది రూపాయలు ఎక్కువే ఇప్పిస్తానని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డాక్టర్ కె. కేశవరావు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిని సవాల్ చేశారు. తొలి అంచనాలకు ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయగలరా అని గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులను అడిగారు.
తాను ముఖ్యమంత్రిని, కాంట్రాక్టర్లను ఒప్పించి చంద్రబాబుకు గానీ, ఆయన మిత్రులకు గానీ, ఆయన సన్నిహితులకు గానీ ప్రాజెక్టు నిర్మాణం కాంట్రాక్టు ఇప్పిస్తానని, తొలి అంచనాలకు పూర్తి చేయడానికి ముందుకు రావాలని ఆయన అన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టుపై తెలుగుదేశం పార్టీ అనవసరమైన రాద్ధాంతం చేస్తోందని ఆయన అన్నారు. ఏది పడితే అది మాట్లాడడం తెలుగుదేశం పార్టీకి మంచిది కాదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
