రెండు ఎన్‌కౌంటర్లు: 5గురు నక్సల్స్ హతం
హైదరాబాద్: రాష్ట్రంలోని రెండు జిల్లాల్లో జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో ఐదుగురు నక్సలైట్లు మరణించారు. మృతుల్లో ఇద్దరు మావోయిస్టులు కాగా, ముగ్గురు ప్రజా ప్రతిప్రతిఘటన నక్సలైట్లు. మహబూబ్‌నగర్ జిల్లా బల్మూర్ మండలం బానాలలో పోలీసులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఇదే మండలంలో బుధవారంనాడు మావోయిస్టులు జహంగీర్ అనే హెడ్ కానిస్టేబుల్‌ను కాల్చి చంపారు.
కరీంనగర్ జిల్లా మహాముత్తారం మండలం స్తంభంపల్లి గ్రామం సమీపంలో పోలీసులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ప్రజాప్రతిఘటన నక్సలైట్లు హతమయ్యారు. మృతుల్లో ప్రజాప్రతిఘటన జిల్లా ఇంచార్జి రంజిత్ ఉన్నట్లు అనుమానిస్తున్నారు. సంఘటనా స్థలంలో ఒక 303 రైఫిల్, ఆరు కిట్ బ్యాగులు లభించాయి.












Click it and Unblock the Notifications
