లెక్చరర్ లైంగిక వేధింపులకు విద్యార్థిని బ లి
విజయనగరం: ఒక అధ్యాపకుడి లైంగిక వేధింపులకు విజయనగరంలో డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. విజయనగరంలోని శ్రీచైతన్య కళాశాల స్టాటిస్టిక్స్ లెక్చరర్ గోవిందరావు లైంగిక వేధింపులకు గురై నందిని అనే బియస్సీ విద్మార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఆ లెక్చరర్‌ను విద్యార్థులు చితకబాది పోలీసులకు అప్పగించారు. లెక్చరర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ధర్నా కూడా నిర్వహించారు.
గోవిందరావు మూడేళ్ల నుంచి నందినిని లైంగిక వేధిస్తున్నాడని సహ విద్యార్థులు చెప్పారు. ఈ విషయాన్ని నందిని తన తల్లిదండ్రులకు కూడా చెప్పుకోలేదు. ప్రాక్టికల్ పరీక్షలు సమీపించడంతో గోవిందరావు తనను ఫెయిల్ చేస్తాడనే ఆందోళనతో నందిని ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు. పలుకుబడి, డబ్బుల వల్ల లెక్చరర్‌పై పోలీసులు చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. నందిని తండ్రి ఆర్టీసిలో చిరుద్యోగి. తాము ఫిర్యాదు చేసినా పోలీసులు లెక్చరర్‌పై చర్యలు తీసుకోవడం లేదని ఆయన ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications
