ఒక్క తెలంగాణలోనే వేయి కోట్లు ఆదా చేస్తాం: టిడిపి
హైదరాబాద్: తెలంగాణ ప్రాంతంలో నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాల్లో వేయి కోట్ల రూపాయలు ఆదా చేస్తామని తెలుగుదేశం నాయకులు చెప్పారు. ప్రాజెక్టులను సకాలంలో నిర్మిస్తామంటే పది రూపాయలు ఎక్కువే ఇస్తామని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డాక్టర్ కె. కేశవరావు చేసిన సవాల్‌ను తెలుగుదేశం నాయకులు ఎర్రబెల్లి దయాకర్ రావు తదితరులు స్వీకరించారు. తాము తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాల్లో వేయి కోట్ల రూపాయలు ఆదా చేస్తామని, ఆ నిధులను ఎస్.సి, బిసి, ఎస్‌టి విద్యార్థుల కోసం ఖర్చు చేస్తారా అని వారు ప్రభుత్వాన్ని సవాల్ చేశారు.
ఎల్లంపల్లి ప్రాజెక్టును 1344 కోట్ల రూపాయలకే నిర్మిస్తామని, శ్రీరాంసాగర్ వరద కాలువ నిర్మాణాన్ని సగం ఖర్చుకే పూర్తి చేస్తామని వారు చెప్పారు. వరద కాలువ నిర్మాణానికి 1200 కోట్ల రూపాయలు ఖర్చవుతాయని ప్రభుత్వం అంచనా వేసిందని, తాము 600 కోట్ల రూపాయలకే నిర్మిస్తామని వారు చెప్పారు. తమ శాసనసభ్యులు సానా మారుతి పర్యవేక్షణలో సాగునీటి ప్రాజెక్టులను తాము గడువు కన్నా ముందే నిర్మించి ఇస్తామని వారు చెప్పారు.












Click it and Unblock the Notifications
