టిడిపి ఆరోపణలపై ఆరుణ గుర్రు
హైదరాబాద్: నెట్టెంపాడు ప్రాజెక్టు కాంట్రాక్టర్లను కమీషన్ కోసం తన భర్త భరతసింహారెడ్డి బెదిరించారనే తెలుగుదేశం పార్టీ ఆరోపణను సమాజ్ వాదీ పార్టీ శాసనసభ్యురాలు డి.కె. అరుణ ఖండించారు. శుక్రవారం శాసనసభలో ఆమె తెలుగుదేశం సభ్యుడు నాగం జనార్దన్ రెడ్డిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సమయంలో ఆరుణకు, నాగం జనార్దన్ రెడ్డికి మధ్య వాగ్వివాదం జరిగింది.
అక్రమ ఇసుక రవాణాను అడ్డుకున్నందుకే తన భర్తపై తెలుగుదేశం నాయకులు తప్పుడు ఆరోపణలు చేశారని అరుణ అన్నారు. నెట్టెంపాడు ప్రాజెక్టు పనుల్లో నాగం జనార్దన్ రెడ్డి కుమారుడికి సబ్ కాంట్రాక్టు ఉందని ఆమె చెప్పారు. నెట్టెంపాడు ప్రాజెక్టు కోసం తాము తీవ్రంగా కృషి చేశామని ఆమె చెప్పుకున్నారు. జనార్దన్ రెడ్డిపై అరుణ తీవ్ర స్వరంతో విమర్శలు చేశారు.












Click it and Unblock the Notifications
