బ్యాంకులు, పోస్టాఫీసులతో ప్రభుత్వం ఒప్పందం
హైదరాబాద్: జాతీయ ఉపాధి హామీ పథకం కింద లబ్ధిదారులకు నగదు చెల్లింపుల కోసం రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారంనాడు బ్యాంకులు, పోస్టాఫీసులతో ఒప్పందం కుదుర్చుకుంది. దీని వల్ల లబ్ధిదారులు నేరుగా ఖాతాలు తెరిచే అవకాశం అందుబాటులోకి వస్తుంది. లబ్ధిదారులకు రెండు వారాలకు ఒకసారి నగదు చెల్లిస్తారు.
రాష్ట్ర ప్రభుత్వం 13 లక్షల ఖాతాల ఖర్చును కూడా భరిస్తుందని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డి. శ్రీనివాస్ చెప్పారు. ప్రతి గ్రామ పంచాయతీలో పోస్టాఫీసు ఉంటుందని, అందువల్ల పోస్టాఫీసులతో ఒప్పందానికి ప్రాధాన్యం ఇచ్చామని ఆయన చెప్పారు. పథకాన్ని పారదర్శకంగా అమలు చేసేందుకే ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆయన తెలిపారు. బోగస్ లబ్ధిదారులున్నారనే అనుమానాలు తలెత్తకుండా, ఇతర ఆరోపణలు రాకుండా పారదర్శకంగా పథకాన్ని అమలు చేయడానికి ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
