నిబంధనలు పాటించకపోతే జైలే గతి: హైకోర్టు
హైదరాబాద్: బందరు రోడ్డు వెడల్పులో నిబంధనలు పాటించకపోతే చంచల్‌గుడా జైలుకు పంపుతామని హైకోర్టు విజయవాడ నగర పాలక సంస్థ కమీషనర్‌ను, ఉడా వైస్ చైర్‌పర్సన్‌ను హెచ్చరించింది. రోడ్డు వెడల్పులో నిబంధనలు పాటించడం లేదని ఫిర్యాదు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. మహాత్మాగాంధీ రోడ్డు వెడల్పులో నిబంధనలు పాటించకపోవడంపై హైకోర్టు వారిద్దరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
రోడ్డు వెడల్పు కోసం భవనాలను, ఇతర కట్టడాలను నిబంధనలకు వ్యతిరేకంగా కూల్చి వేయడంపై హైకోర్టు న్యాయమూర్తి నర్సింహారెడ్డి కమీషనర్‌పై, ఉడా వైస్ చైర్‌పర్సన్‌పై మండిపడ్డారు. కొద్దిసేపటి తర్వాత కమీషనర్ క్షమాపణలు చెప్పారు. క్షమాపణలో జరిగిన నష్టాన్ని పూడ్చలేమని జస్టిస్ నర్సింహారెడ్డి అన్నారు. బందరు రోడ్డు వెడల్పులో కచ్చితంగా నిబంధనలు పాటించాలని హైకోర్టు ఆదేశించింది.












Click it and Unblock the Notifications
