శ్రీవారికి ఎంపీ రూ. 4 కోట్ల వజ్రాభరణాలు
తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయానికి చిత్తూరు పార్లమెంటు సభ్యుడు ఆదికేశవులు నాయుడు నాలుగు కోట్ల రూపాయల విలువ చేసే వజ్రాభరణాలను బహూకరించారు. వీటిని శ్రీ శృంగేరి పీఠాధిపతి చేతుల మీదుగా శ్రీవారికి ప్రదానం చేయించారు. వజ్రాలు పొదిగిన కటి హస్తం, అమ్మవారికి మంగళ సూత్రాలు, ముక్కు పుడక బహూకరించారు.
తాను తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) చైర్మన్‌గా పని చేసినప్పుడు వాటిని చేయిస్తానని మొక్కుకున్నానని, ఇప్పుడు ఆ మొక్కు తీర్చుకున్నానని ఆదికేశవులునాయుడు శుక్రవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. ఆ వజ్రాభరణాలను ఆయన మీడియా ప్రతినిధులకు చూపించారు. శ్రీ కృష్ణ దేవరాయాల కాలంలో చేయించిన మంగళసూత్రాలే ఇప్పటికీ ఉన్నాయని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
