కప్పిపుచ్చుకోవడానికి చర్చను సాగదీస్తున్నారు: నాగం
హైదరాబాద్: ఎల్లంపల్లి ప్రాజెక్టు అక్రమాలను కప్పి పుచ్చుకోవడానికి ప్రభుత్వం శాసనసభలో చర్చను సాగదీస్తోందని తెలుగుదేశం శాసనసభా పక్ష ఉప నాయకుడు డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి విమర్శించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు అక్రమాల్లో అధికారులను బలిపశువులను చేయడానికి ప్రయత్నిస్తోందని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు అక్రమాలను తాము నిరూపించడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు.
ఫైళ్లను స్పీకర్ ముందు పెట్టి ఉంటే చర్చ పేరుతో శాసనసభా సమయం వృధా అయి వుండేది కాదని, ప్రజా సమస్యలపై చర్చించి ఉండేవారమని ఆయన అన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు అక్రమాలకు సంబంధించిన ఫైళ్లను తారుమారు చేయడానికి చర్చను కొనసాగిస్తూ ప్రయత్నాలు చేస్తోందని, తమ వద్ద అన్ని ఆధారాలున్నాయని, తారుమారు చేయడానికి ప్రభుత్వానికి సాధ్యం కాదని ఆయన అన్నారు. సభలో తమ సభ్యులు మాట్లాడింది తక్కువ సమయమేనని, కావాలని సభా సమయాన్ని ప్రభుత్వం వృధా చేస్తోందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
