రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్లు దాఖలు

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ రాజ్యసభ అభ్యర్థులు శుక్రవారం నామినేషన్లు దాఖలు చేశారు. మొదట కాంగ్రెస్‌ మిత్ర పక్షం సిపిఐ అభ్యర్థి అజీజ్‌ పాషా నామినేషన్‌ వేశారు. అనంతరం ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డాక్టర్‌ కె. కేశవరావు, సంజీవరెడ్డి, రషీద్‌ అల్వీ తమ నామినేషన్‌ పత్రాలను శాసనసభ కార్యదర్శికి అందజేశారు. ఈ నామినేషన్ల కార్యక్రమానికి ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. తెలుగుదేశం అభ్యర్థి డాక్టర్‌ ఎం.వి. మైసురారెడ్డి కూడా నామినేషన్‌ దాఖలు చేశారు.

రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనను ప్రోత్సహించేందుకు తాను కృషి చేస్తానని సంజీవరెడ్డి చెప్పారు. కార్మికుల సంక్షేమానికి, కొత్త ఉద్యోగాల కల్పనకు తాను పాటు పడతానని ఆయన అన్నారు. తనకు అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తానని కేశవరావు మీడియా ప్రతినిధులతో చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పలు అభివృద్ది కార్యక్రమాలను చేపడుతోందని, ఇందుకు తన సహకారం అందిస్తానని, మైనారిటీల విద్య మెరుగు కోసం పాటుపడాతనని రషీద్‌ అల్వీ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+