ఎస్‌ఎస్‌సి పరీక్షల తర్వాత టీచర్ల నియామకం
హైదరాబాద్: పదవ తరగతి (ఎస్‌ఎస్‌సి) పరీక్షలు అయిపోగానే ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేస్తామని పాఠశాల విద్యామంత్రి ఎన్. రాజ్యలక్ష్మి చెప్పారు. ఉపధ్యాయుల ఉమ్మడి సర్వీసు నిబంధనల రూపకల్పనలో జరిగిన జాప్యం వల్లనే ఇప్పటి వరకు ఖాళీ పోస్టులను భర్తీ చేయలేకపోయామని ఆమె శుక్రవారం శాసనసభలో చెప్పారు.
రాష్ట్రంలో 65,375 పాఠశాలలు ఉన్నాయని, వీటిలో 2 లక్షల 54 వేల దాకా ఉపాధ్యాయులు ఉన్నారని, 15,475 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆమె చెప్పారు. పదో తరగతి పరీక్షలు అయిపోగానే టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని ఆమె చెప్పారు.












Click it and Unblock the Notifications
