విజయనగరంలో ఎసిబి వలలో పెద్ద చేప
విజయనగరం: అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) వలలో ఓ పెద్ద చేపడింది. విజయనగరం ఫుడ్ ఇన్‌స్పెక్టర్ గౌస్ మొహియుద్దీన్‌ను లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా ఆదివారంనాడు పట్టుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అక్రమ కేసులు బనాయించుకండా ఉండేందుకు వ్యాపారుల నుంచి మొహియుద్దీన్ 50 వేల రూపాయల లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు పట్టుకున్నారు. ఆయనను అరెస్టు చేశారు.
గౌస్ మొహియుద్దీన్‌పై విజయవాడలో పనిచేస్తుండగా ఆదాయానికి మించి ఆస్తులు కలిగి వున్నాడనే ఆరోపణపై కేసు నమోదైంది. ఈ కేసు పెండింగ్‌లో ఉండగానే ఆయన లంచం తీసుకుంటూ ఎసిబికి చిక్కారు.












Click it and Unblock the Notifications
