బిజెపి రాతపూర్వక హామీ ఇవ్వాలి: చిన్నారెడ్డి
హైదరాబాద్: తెలంగాణ బిల్లుకు పార్లమెంటులో మద్దతు ఇస్తామని భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాతపూర్వకంగా తెలియజేయాలని తెలంగాణ ప్రాంతీయ కాంగ్రెస్ సమన్వయ కమిటీ (టిఆర్‌సిసిసి) జి. చిన్నారెడ్డి అన్నారు. బిజెపిని నమ్మడానికి వీలు లేదని, అందువల్ల రాతపూర్వకంగా ఇస్తేనే బిజెపిని నమ్మడానికి వీలుంటుందని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
రాజ్‌నాథ్ సింగ్ ప్రకటనను ఆహ్వానిస్తున్నామని ఆయన చెప్పారు. తెలంగాణ కోసం కాకినాడలో తీర్మానం చేసిన బిజెపి ఆ తర్వాత మాట మార్చిందని ఆయన అన్నారు. అద్వానీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బిజెపి వైఖరి కోసం ప్రణబ్ కమిటీ రెండు సార్లు లేఖ రాసిందని, అయితే బిజెపి నుంచి జవాబు రాలేదని ఆయన గుర్తు చేశారు. ప్రణబ్ కమిటీకి బిజెపి రాతపూర్వకంగా తెలియజేయాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
