తెలంగాణపై అందరివీ నాటకాలే: సిపియం

హైదరాబాద్‌: తెలంగాణపై భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాజ్‌నాథ్‌ ప్రకటన బిజెపి, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), కాంగ్రెస్‌ల నాటకమని సిపియం రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులు వ్యాఖ్యానించారు. ఈ మూడు పార్టీలు తెలంగాణపై ప్రజలను మభ్యపెడుతన్నాయని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. రాజ్‌నాథ్‌ ప్రకటన ప్రజలు మోసం చేయడంలో భాగమేనని ఆయన విమర్శించారు.

తెలంగాణపై ఈ మూడు పార్టీలు ముందు తమ వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. మరోసారి మోసం చేయడానికే రాజ్‌నాథ్‌ ప్రకటన వెలువడిందని ఆయన అన్నారు. ఆ మూడు పార్టీలు వైఖరి స్పష్టం చేసి వుంటే తెలంగాణ ఏర్పాటుకు ఇంత కాలం పట్టి వుండేది కాదని ఆయన అన్నారు. ఇలాంటి ప్రకటనలు చేసేవారే మోసం చేస్తారని ఆయన అన్నారు. తమ వైఖరి ఏమిటనేది అనవసరమని, ముందు ఆ పార్టీల వైఖరి తేలాలని ఆయన అన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు ఫైళ్లను స్పీకర్‌ ముందు ప్రభుత్వం పెట్టడం లేదంటే అవినీతికి పాల్పడినట్లేనని ఆయన వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+