సచిన్ మరోసారి విఫలం: కష్టాల్లో భారత్
ముంబాయి: ఇంగ్లాండుతో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో వెంట వెంటనే వికెట్లు కోల్పోయి భారత్ కష్టాల్లో పడింది. 28 పరుగులకే భారత్ మూడు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు సెహ్వాగ్, వసీం జాఫర్‌లు ఏ మాత్రం రాణించలేదు. సెహ్వాగ్ ఆరు పరుగులు, వసీం జాఫర్ 11 పరుగులు చేశారు. ఆ తర్వాత సచిన్ టెండూల్కర్ కేవలం ఒక పరుగు మాత్రమే చేసి అవుటయ్యాడు. దీంతో భారత్ పీకల లోతు కష్టాల్లో పడింది. ఆ తర్వాత ద్రావిడ్‌తో కలిసి యువరాజ్ భారత ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే పనికి పూనుకున్నాడు. ఆదివారం ఆట ముగిసే సమయానికి భారత్ మూడు వికెట్లు కోల్పోయి 89 పరుగులు చేసింది. ద్రావిడ్ 37 పరుగులతో, యువరాజ్ 32 పరుగులతో క్రీజ్‌లో వున్నారు. హోగార్డు రెండు వికెట్లు పడగొట్టాడు.
అంతకు ముందు ఇంగ్లాండు తన తొలి ఇన్నింగ్స్‌లో 400 పరుగులు చేసింది. స్ట్రాస్ 128 పరుగులతో మంచి ప్రారంభాన్ని ఇచ్చాడు. షా మరో సారి భారత్‌ను ఎదుర్కోవడంలో తన సత్తా చూపాడు. షా 88 పరుగులు చేశాడు. ఇంగ్లాండు కెప్టెన్ 50 పరుగులు చేశాడు. శ్రీశాంత్‌కు నాలుగు వికెట్లు దక్కగా, హర్భజన్ మూడు వికెట్లు, మునాఫ్ పటేల్ రెండు వికెట్లు, కుంబ్లే ఒక వికెటు తీసుకున్నారు. ఇర్ఫాన్ పఠాన్ ఒక్క వికెట్ కూడా తీసుకోలేకపోయాడు.












Click it and Unblock the Notifications
