పోలీసులపైకి నక్సల్స్ కాల్పులు: హోరాహోరి
మహబూబ్‌నగర్: గాలింపు కోసం వెళ్తున్న గ్రేహౌండ్స్ బలగాలపై మావోయిస్టులు మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్ సమీపంలో కాల్పులకు దిగాయి. దీంతో గ్రేహౌండ్స్ పోలీసులు ఎదురుకాల్పులు ప్రారంభించారు. ఇరు పక్షాల మధ్య హోరాహోరి పోరు జరిగింది. శ్రీశైలం ఎగువ ప్రాంతం నుంచి పోలీసులు గాలింపు కోసం బయలుదేరారు.
కృష్ణానదిలో పుట్టిపై వెళ్తుండగా మావోయిస్టులు కాల్పులు మొదలు పెట్టారు. నల్లమల అడవుల్లో గాలింపు కోసం పోలీసులు వస్తున్నారు. ఈ ఎదురు కాల్పుల్లో ఇరు వైపులా ఎటువంటి నష్టం జరగలేదని తెలుస్తోంది. నల్లమల ఆడవులు కర్నూలు, మహబూబ్‌నగర్ జిల్లాల్లో విస్తరించి వున్న విషయం తెలిసిందే. కర్నూలు జిల్లా సరిహద్దుల నుంచి మహబూబ్ నగర్ జిల్లాలోకి గ్రేహౌండ్స్ ప్రవేశిస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications
