తెలంగాణపై ఇక వంతు కాంగ్రెస్‌దే: వెంకయ్య
నెల్లూరు: తెలంగాణపై తమ వైఖరి స్పష్టం చేశామని, ఇక మిగిలింది కాంగ్రెస్ వంతేనని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు ఎం. వెంకయ్యనాయుడు అన్నారు. హిందీ మాట్లాడే ప్రాంతాలు పది రాష్ట్రాలుగా ఏర్పడినప్పుడు తెలుగు మాట్లాడే ప్రజలున్న ప్రాంతం రెండు రాష్ట్రాలుగా ఏర్పడడం వల్ల నష్టమేమీ లేదని ఆయన ఆదివారం నెల్లూరు జిల్లా కావలిలో అన్నారు.
ఉద్యమాల అవసరం లేకుండా, విద్వేషం, విద్రోహం మాటలు రాకుండా ఆంధ్ర, తెలంగాణా ప్రాంతాలు సోదరభావంతో విడిపోవడం మంచిదని ఆయన అన్నారు. జోడు పదవుల్లో కొనసాగుతున్న కాంగ్రెస్ అధ్యక్షరాలు సోనియా గాంధీపై కూడా ఎన్నికల కమీషన్ చర్య తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సోనియా గాంధీపై చర్య ద్వారా ఎన్నికల కమీషన్ నిష్పాక్షికతను ప్రకటించుకోవాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
