ఎసిపి ఇళ్లపై ఎసిబి దాడులు: ఆస్పత్రిలో ఎసిపి
హైదరాబాద్: కాకినాడ ఆదనపు పోలీసు సూపరింటిండెంట్ (ఎయస్‌పి) రాధా ఆస్తులపై అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) దాడులు నిర్వహించింది. ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారనే అనుమానంతో ఈ దాడులు జరిగాయి. నెల్లూరు, విజయవాడల్లోని రాధా బంధువుల ఇళ్లలో ఎసిబి అధికారులు సోదాలు నిర్వహించారు. ఎసిబి అధికారులు 40 లక్షల రూపాయల విలువ చేసే ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఎసిబి దాడుల గురించి ముందే తెలుసుకున్న ఎసిపి గుండె నొప్పి పేరుతో హైదరాబాద్‌లోని యశోదా ఆస్పత్రి చేరారు. రాధా ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులంటున్నారు.
ఇదిలావుంటే, శ్రీకాకుళం జిల్లాలో కమర్షియల్ టాక్స్ క్లర్క్ గాంధీకృష్ణ ఇళ్లలో కూడా ఎసిబి అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో 50 లక్షల విలువ చేసే ఆస్తులు లభ్యమైనట్లు సమాచారం. కాగా హైదరాబాద్‌లోని పంచాయతీరాజ్ కమీషనర్ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ ప్రసాద్ వేయి రూపాయలు లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు వల పన్ని పట్టుకున్నారు.












Click it and Unblock the Notifications
